Priyanka Gandhi : కష్ట కాలం మీ మద్దతు అవసరం
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కామెంట్స్
Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఆమె పర్యటిస్తున్నారు. బుధవారం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శృంగేరీ పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శారదా దేవిని దర్శించుకున్నారు. పూజలు చేశారు ప్రియాంకా గాంధీ. గజరాజును దువ్వారు. అనంతరం చిక్కమగళూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.
ఆనాడు నాయనమ్మ ఇందిరా గాంధీ చిక్కమగళూరుకు వచ్చినప్పుడు ఆమెకు ఆనాడు పోరాట కాలం. ఆ కష్ట కాలంలో ఈ ప్రాంత ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇవాళ మనుమడు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. తమ కుటుంబం ప్రస్తుతం న్యాయం కోసం పోరాడుతోందని చెప్పారు. దేశ ప్రజలు అండగా ఉంటారని తాను ఆశిస్తున్నానని, ఆ విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు ప్రియాంకా గాంధీ.
కన్నడ వాసులు ఆరాధించే శారదా దేవీ అమ్మ వారిని ఒక్కటే కోరుకున్నానని చెప్పారు. శారదా దేవీ తన జ్ఞాన జ్యోతితో దేశంలో కొనసాగుతున్న దురాచారాలను తుద ముట్టించాలని ప్రార్థించానని తెలిపారు. దేశంలో అరాచక పాలన సాగుతోందని, దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ.
Also Read : రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి – సుప్రీం