Priyanka Gandhi : మోదీ..బాధ్యతల నుంచి పారిపోతే ఎలా
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్
Priyanka Gandhi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. తన బాధ్యతలను గుర్తించకుండా విదేశీ పర్యటనలు చేయడం దారుణమన్నారు. ఓ వైపు దేశంలో సమస్యలు పేరుకు పోతున్నాయని కానీ ఇప్పటి వరకు వాటి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు మోదీ.
Priyanka Gandhi PM Modi
ఓ వైపు ఈశాన్య భారతం భగ్గుమంటోందని, మణిపూర్ కాలి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. ఒక రకంగా నరేంద్ర మోదీ తన బాధ్యతల నుంచి పారి పోవడం మంచి పద్దతి కాదని సూచించారు. ఇప్పటి వరకు వరుస ఘటనలు, ఘోరాలు, హింసాత్మక దాడులు పెరిగి పోతున్నా నోరు మెదప లేదని ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం ప్రధానికి తగదని పేర్కొన్నారు.
నిర్దేశించిన రాజ్యాంగం ప్రకారం నడుచు కోవాల్సిన ప్రధాన మంత్రి చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ముందుగా మీరు రాజ ధర్మాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు.
మోదీ 9 ఏళ్ల పాలనలో దేశం పురోభివృద్ది కంటే తిరోగమనం వైపు ప్రయాణం చేస్తోందన్నారు. ఆయనకు విదేశాలలో పర్యటించడంపై ఉన్నంత శ్రద్ద దేశంపై, 137 కోట్ల మంది ప్రజల బాగోగులపై ఉండదని ధ్వజమెత్తారు ప్రియాంక గాంధీ.
మీ రాజధర్మాన్ని అనుసరించండి.
Also Read : PM Modi Tribute : ఆజాద్..తిలక్ కు కోటి వందనాలు