Priyanka Gandhi : బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు శాపం
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం రాష్ట్రంలోని మాండ్యాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). రాష్ట్రంలో కొలువు తీరిన బొమ్మై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
కాషాయ ప్రభుత్వం ప్రజల పాలిట, రాష్ట్రం పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. తమ హయాంలోనే రాష్ట్రంలో ఐటీ, ఆటో మొబైల్ , టెక్నాలజీ , ఎలక్ట్రానిక్ రంగాలలో ప్రయారిటీ ఇచ్చామన్నారు. కానీ బీజేపీ అక్రమంగా కొలువు తీరడమే కాకుండా అవినీతికి అందలం ఎక్కించిందని ధ్వజమెత్తారు.
దీంతో ప్రస్తుతం పనులు కావాలంటే ముందస్తుగా 40 శాతం కమీషన్ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఇలాంటి సర్కార్ ను తాను ఎక్కడా చూడలేదన్నారు. అవినీతి గురించి ఆరా తీస్తే ముందుగా కర్ణాటక పేరు వస్తోందని ఎద్దేవా చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాయ మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రియాంక గాంధీ హెచ్చరించారు.
Also Read : నేను నిందితుడిని కాను – రాఘవ్ చద్దా