Priyanka Gandhi : పాలకుర్తి – తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. ఉన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించారు.
Priyanka Gandhi Comment about Telangana
ఎందరో చేసిన త్యాగాలు, బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడిందన్నారు. ఈ రాష్ట్రం బాగు పడాలంటే మీరు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ త్యాగం చేసిన వాళ్లు ఒక వైపు దోపిడీ చేసిన వాళ్లు మరో వైపు ఉన్నారని ఆవేదన చెందారు.
అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). రేయింబవళ్లు కష్టపడి చదివి ప్రిపేర్ అయితే పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ లు అవుతున్నాయని , చివరకు రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ మారి పోయిందని ఇక పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ ప్రశ్నించారు ప్రియాంక గాంధీ.
ఓ వైపు రైతులు , నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని మెరుగైన పాలన రావాలంటే, జవాబుదారి తనం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని కోరారు.
Also Read : Harish Rao : గులాబీ జెండా గెలుపు పక్కా