Priyanka Gandhi : అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : ములుగు జిల్లా – తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసుకున్న వాళ్లకు, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరా ఇస్తామన్నారు. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ.
Priyanka Gandhi Commitment
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో చేపట్టిన విజయ్ భేరీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ పోరాటంలో అమరులైన వారి పేరెంట్స్ లేదా భార్యలకు రూ. 25 వేల నెల నెలకు పెన్షన్ అందజేస్తామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ.
అంతే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 4 వేల రూపాయలను భృతి ఇస్తామని ప్రకటించారు . గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారి కోసం గల్ఫ్ సెల్ రూపొందిస్తామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా పూర్తిగా అన్ని మాఫియాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేరాఫ్ గా మారిందని ఆరోపించారు.
Also Read : Rahul Gandhi : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన