Priyanka Gandhi : మోసం బీజేపీ నైజం – ప్రియాంక
ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్
Priyanka Gandhi : మధ్యప్రదేశ్ – భారత దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.
Priyanka Gandhi Slams BJP
శాంతియుతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఎన్నికలు వచ్చినప్పుడు తప్పుడు వాగ్ధానాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నారు ప్రియాంక గాంధీ. దేశంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వస్తున్న ప్రజల స్పందన చూస్తుంటే తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
Also Read : BJP Fourth List : బీజేపీ నాలుగో లిస్టు డిక్లేర్