Priyanka Gandhi : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర పడేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారంలో మునిగి పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో జల్లెడ పట్టింది ఆ పార్టీ. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
Priyanka Gandhi Telangana Tour
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తుక్కుగూడ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆవిష్కరించారు. ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 43 పేజీలు 68 అంశాలను చేర్చింది కాంగ్రెస్.
మొత్తం 119 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా పార్టీ ప్లాన్ రూపొందించింది. ఇందులో భాగంగానే పార్టీ పరంగా క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 23 రాత్రి వరకు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రానున్నారు. ఇక్కడే ఆమె మూడు రోజుల పాటు విడిది చేస్తారని టీపీసీసీ స్పష్టం చేసింది. 27 దాకా తెలంగాణలోనే ఉంటారు.
ఇక ఆమెతో పాటు రాహుల్ గాంధీ 25, 26 తేదీలలో పర్యటించనున్నారు తెలంగాణలో . కొన్ని చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరికొన్ని చోట్ల జరిగే రోడ్ షోస్ లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ పేర్కొంది.
Also Read : CM KCR : కాంగ్రెస్ మోసం తెలంగాణ నాశనం