Priyanka Rahul : హైదరాబాద్ – తెలంగాణలోని నాలుగున్నర ప్రజలతో తమకు రాజకీయ సంబంధం లేదని అంతకు మించిన కుటుంబ బంధం ఉందన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు.
Priyanka Rahul Viral
తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన చరిత్ర ఈ సర్కార్ దని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎందుకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ప్రశ్నించారు. 2 లక్షలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. దళిత బంధు , రైతు బంధు, బీసీ బంధుల పేరుతో నిట్ట నిలువునా మోసం చేశాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ విడి పోయిన సమయంలో మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడంటూ సీఎంపై మండిపడ్డారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). అబద్దాలను ప్రచారం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ , ఎంఐఎంలు ఆరి తేరాయంటూ ఆరోపించారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ ఈ వేవ్ చూస్తుంటే తెలంగాణలో హస్తం చేతికి అధికారం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : Election Campaign End : ఎన్నికల ప్రచారం పరిసమాప్తం