Project-K Deepika : తళుక్కుమన్న దీపికా పదుకొనే
ప్రాజెక్టు కె పోస్టర్ హల్ చల్
Project-K Deepika : బాలీవుడ్ ముద్దు గుమ్మ దీపికా పదుకొనే హాట్ టాపిక్ గా మారారు. ఆమె బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ లో నటించారు. ఇది బాలీవుడ్ ను షేక్ చేసింది. వసూళ్ల వర్షం కురిపించింది. అంతకు ముందు ఆమె గెహరియాన్ లో నటించింది. పఠాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దీపికాకు డార్లింగ్ ప్రభాస్ తో నటించే ఛాన్స్ లభించింది. క్రియేటివ్ దర్శకుడిగా పేరొందిన నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో తెర కెక్కిస్తున్న ప్రాజెక్టు – కె చిత్రంలో కీల రోల్ పోషిస్తోంది. ఇందులో భాగంగా దీపికా పదుకొనే పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దీనికి భారీ ఆదరణ లభిస్తోంది.
ఇక చిత్రం విషయానికి వస్తే కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అంతా నాగ్ అశ్విన్ దే. డైలాగ్ కింగ్ మేకర్ గా పేరు పొందిన సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తుండడం విశేషం. సి. అశ్వని దత్ నిర్మించారు . ఈ ప్రాజెక్టు – కె చిత్రంలో ప్రభాస్ , దీపికా పదుకొనేతో పాటు ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దిశా పటానీ నటించారు.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వచ్చే ఏడాది 2024 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఖరారు చేశారు మూవీ మేకర్స్. తాజాగా దీపికా పోస్టర్ మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉంది.
Also Read : Nidhhi Agerwal : పవర్ స్టార్ తో నటించడం అద్భుతం
