AAP MCD Report : ఆప్ కౌన్సిలర్ల ప్రగతిపై ప్రచారం
శనివారం శ్రీకారం చుట్టనున్న సీఎం
AAP MCD Report : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన భారతీయ జనతా పార్టీ ఏం సాధించిందో తాము గెలుపొందిన 20 రోజుల్లో తాము ఏం చేశామనే దానిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రికార్డును ప్రజలకు తెలియ చేయనుంది.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం డిసెంబర్ 31న ప్రారంభించనున్నారు. దీని పేరు ఆప్ కౌన్సిలర్ల రికార్డ్ కార్డ్ రిపోర్ట్(AAP MCD Report) పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. దీనికి అందమైన క్యాన్షన్ కూడా పెట్టింది ఆప్. బీజేపీ 15 ఏళ్లు వర్సెస్ ఆప్ మూడు వారాల ప్రచారం పేరుతో విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని ఆప్ నాయకుడు దుర్గేష్ పాఠక్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 20 రోజుల్లో తమ కౌన్సిలర్లు చేసిన పనిపై ఆప్ రిపోర్ట్ కార్డును షేర్ చేస్తుందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో మొత్తం 250 సీట్లకు గాను 134 సీట్లు సాధించింది ఆప్. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 104 సీట్లు మాత్రమే గెలుచుకుంది. త్వరలోనే మరికొన్ని మార్పులు చూస్తారని ఆప్ స్పష్టం చేసింది.
కాగా కొత్త కౌన్సిల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా జరగలేదు. అయినప్పటికీ ఆప్ కు చెందిన వారు తమ వార్డులలో పని చేయడం ప్రారంభించారని దుర్గేశ్ పాఠక్ చెప్పారు. కేవలం 20 రోజుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే మా వారు పనులు చేపట్టడంలో మునిగి పోయారని తెలిపారు.
Also Read : దలైలామాను కలుసుకున్న నితీశ్