Chandigarh University Row : బాలిక వీడియోలు లీక్ పై నిరసన
చండీగఢ్ యూనివర్శిటీలో ఆందోళన
Chandigarh University Row : బాలికలకు సంబంధించిన హాస్టల్ వీడియోలు ఆన్ లైన్ లో లీక్ కావడంతో చండీగడ్ యూనివర్శిటీలో నిరసనలు మిన్నంటాయి. నిందితురాలిగా భావిస్తున్న విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని ప్రశాంతంగా ఉండాలని విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ కోరారు.
ఇదిలా ఉండగా పంజాబ్ లోని మొహాలీలో చండీగఢ్ యూనివర్శిటీలో(Chandigarh University Row) ఓ బాలిక తన హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను ఆన్ లైన్ లో లీక్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
దీంతో దీనికి కారణమైన స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆమెను ప్రశ్నిస్తున్నారు. కావాలని చేసిందా లేక అనుకోకుండా జరిగిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.
వీడియో లీక్ పై పలువురు బాలికలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి.
దీనిని యూనివర్శిటీతో పాటు పోలీసులు ఖండించాయి. వాటిని పుకార్లుగా కొట్టి పారేశారు. ఒక బాలిక స్పృహ తప్పి పడి పోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారని, పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
దీనిపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందన్నారు. సదరు అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో తన స్వంత వీడియోలు, ఫోటోలు పంచుకుందని, ఇతరులు తమ చిత్రాలను కూడా పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.
సంయమనం పాటించాలని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
Also Read : బిల్కిస్ బానో కోసం పాదయాత్రకు సిద్ధం