LT Gen Anil Chauhan : బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
LT Gen Anil Chauhan : భారత దేశానికి రక్షణ పరంగా త్రివిధ దళాధిపతి (సీడీఎస్ ) గా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు రిటైర్డ్ జనరల్ అనిల్ చౌహాన్(LT Gen Anil Chauhan). కేంద్ర ప్రభుత్వంతో పాటు 135 కోట్ల భారతీయుల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని స్పష్టం చేశారు. జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య తమిళనాడులో తొమ్మిది నెలల కిందట విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఆనాటి నుంచి సీడీఎస్ పోస్టు ఖాళీగా ఉంది. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా త్రివిధ దళాధిపతి పోస్టులో పదవీ విరమణ పొందిన అనిల్ చౌహాన్(Anil Chauhan) ను నియమించింది. త్రీస్టార్ అధికారిని పోర్త్ స్టార్ ర్యాంక్ కు తీసుకు రావడం ఇదే తొలిసారి. కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఢిల్లీలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 30న గార్డ్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించారు ముందుగా జనరల్ అనిల్ చౌహాన్(LT Gen Anil Chauhan). బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనరల్ అనిల్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో అత్యున్నత పదవి సీడీఎస్. ఇవాళ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నా.
అంతే కాదు జీవిత కాలమంతా భారత దేశం కోసం రక్షణ పరంగా ప్రయత్నిస్తూ ప్రత్యర్థి దేశాలలో వణుకు పుట్టించిన జనరల్ బిపిన్ రావత్ మన మధ్య లేక పోవడం బాధాకరంగా ఉందన్నారు జనరల్ అనిల్ చౌహాన్. ఆయన స్థానంలో తనను నియమించిన కేంద్ర ప్రభుత్వానికి , ఆమోదించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియ చేశారు.
Also Read : ఆర్బీఐ బిగ్ షాక్ రెపో రేటు పెంపు