YS Jagan : ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం – జగన్
ఎన్ని కోట్లు అయిన ఆసరే ఆదుకుంటాం
YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయం, మహిళా సాధికారత, భద్రతపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ బడుల కంటే బాగుండేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేలా కృషి చేశారు. వేల కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
తాజాగా రాష్ట్రంలో ఆరోగ్య పరంగా పేదలకు అందుబాటులో ఉండేలా చేయడంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపద సమయంలో ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అదనపు రోగాలను కూడా చేర్చాలని సీఎం జగన్ రెడ్డి(YS Jagan) ఆదేశించారు.
ప్రజారోగ్యానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రెడ్డి సమీక్షించారు. మన్యం జిల్లాల్లో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీలో 754 ప్రొసీజర్లను చేరుస్తున్నామని చెప్పారు సీఎం. ఇప్పటి వరకు ఈ పథకంలో 3,118 ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అందుబాటు లోకి రావాలని స్పష్టం చేశారు.
ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్ , పీహెచ్సీ , సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ దవఖానాలు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్సీలను జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిధిలోకి తీసుకు రావాలని ఆదేశించారు జగన్ రెడ్డి(YS Jagan).
జిల్లా కేంద్రాల్లో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. కమ్యూనిటీ పరంగా హెల్త్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : రాజకీయాల్లో గుణనాత్మక మార్పు రావాలి
