Rahul Gandhi : ప్ర‌జా తీర్పు ప్ర‌శంస‌నీయం – రాహుల్

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే..ప్రియాంక గాంధీ

Rahul Gandhi : విద్వేషం, కులం, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పార‌ని మీరు అందించిన ఈ విజ‌యం ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌న్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). శ‌నివారం క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాము ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ. సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని, మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు సౌక‌ర్యం ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు.

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌సంగిస్తూ ఇది పూర్తిగా క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు సాధించిన విజ‌య‌మ‌న్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా మారారు సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. దేశంలోని వివిధ పార్టీల‌కు చెందిన దిగ్గ‌జ నాయ‌కులు పాల్గొన్నారు. సీఎంలు, మాజీ సీఎంలు, ప్ర‌ముఖ న‌టులు పాల్గొన్నారు. కొత్త ప్ర‌భుత్వం బాగుండాల‌ని కోరారు. వీరిలో త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

Also Read : Siddaramaiah DK Shiva Kumar

Leave A Reply

Your Email Id will not be published!