Bhagwant Mann : పంజాబ్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ (Bhagwant Mann)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విప్లవం వర్ధిల్లాలి అంటూ ప్రారంభించిన ఆయన తమ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు.
ఓటు వేసిన వారే కాదు ఓటు వేయని వారు కూడా పంజాబ్ ప్రజలేనని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, ల్యాండ్ , సాండ్ , డ్రగ్స్ మాఫియాలను కంట్రోల్ చేయడం తమ ముందున్న సవాల్ అని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారం తనకు కావాలన్నారు. అశేష ప్రజల హర్షధ్వానాల మధ్య ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు.
ఈ దేశం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన వీడిరు భగత్ సింగ్ నాకు ఆదర్శం. ఆయన కలగన్న కలల్ని నిజం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
జన సంక్షేమమే తమ ప్రయారిటీ అని పేర్కొన్నారు భగవంత్ మాన్. ప్రతిక్ష నేతలను రెచ్చగొట్టే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని తెలిపారు.
చిల్లర మల్లర రాజకీయాలు తనకు పడవన్నారు. అందులో తల దూర్చే ప్రసక్తి లేదన్నారు. ఆప్ కు ఓటు వేయని వారికి కూడా తాను సీఎంనని, వారి కోసం కూడా తాను పని చేస్తానని చెప్పారు మాన్(Bhagwant Mann).
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయన్నారు. నా ప్రవర్తన వింతగా ఉంటుందని అర్థం చేసుకోవాలని సూచించారు సీఎం. ఇక నుంచి ఆఫీసుల్లో భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు.
Also Read : సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్