Buggana Rajendranath : ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath ). అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా తీసుకుంటున్న ఏకైక రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు.
కరోనా కష్ట కాలంలో సైతం ఎక్కడా వెనుకంజ వేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై శాసనమండలిలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, వ్యవసాయం, ఐటీ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చిన ఘనత మన సీఎందేనని ప్రశంసించారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం ఇవాళ భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ క్రెడిట్ అంతా సీఎంకే దక్కుతుందన్నారు.
యువ నాయకుడు రాష్ట్రానికి నాయకత్వం వహించడం వల్లే సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని చెప్పారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath ). ప్రభుత్వం తీసుకు వచ్చిన నవరత్నాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాయన్నారు.
వీటిని అమలు చేయడం వల్ల పేదరికం తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు ఏపీ మంత్రి. తమ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాజాగా సర్కార్ చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. వాస్తవాలను మభ్య పెట్టే విషయంలో చంద్రబాబు మించిన నాయకుడు లేడని ఎద్దేవా చేశారు.
Also Read : ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు