KTR : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – కేటీఆర్
అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చడమే ఉద్దేశం
KTR : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే కేవలం సంక్షేమం తప్ప మరొకటి కాదని కుండ బద్దలు కొట్టారు తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా భూత్పూర్ మున్సిపాలిటీలో ఏడో నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చసిన స్వాగత ద్వారాన్ని, ఓపెన్ జిమ్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ శుభ వేళ ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. గతంలో పాలకులు తమ స్వలాభం మాత్రమే చూసుకున్నారని, కానీ సీఎం ముందు చూపుతో తెలంగాణను అన్ని రంగాలలో దూసుకు పోయేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు పాలమూరు అంటేనే వలసలు ఉండేవని, కానీ ఇవాళ ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి బతుకు దెరువు కోసం వలసలు వస్తున్నారని ఇదే తాము సాధించిన ఘనత అని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఐటీ అంటే ప్రధాన నగరాలకే అనే భావన ఉండేదని, కానీ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలకు సంబంధించిన కంపెనీలను జిల్లా స్థాయిలకు తీసుకు వచ్చామని దీని వల్ల ఎందరికో ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రజలు పని చేసే వాళ్లకే పట్టం కడతారని అన్నారు.
Also Read : Covid19 : మళ్లీ పెరిగిన కరోనా కేసులు