Pranay Pathole Elon Musk : ఎలోన్ మస్క్ కు పుణె టెక్కీ సపోర్ట్
ఆయన గొప్ప ఇంజనీర్ అని కితాబు
Pranay Pathole Elon Musk : ఓ వైపు ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు ఎలాన్ మస్క్ ను. ఆయన ఇటీవలే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బోర్డు డైరెక్టర్లను తొలగించాడు. ఆపై టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగనంపుతున్నారు. ఎలాన్ మస్క్ కు ఇద్దరు భారతీయ టెక్కీలతో ప్రత్యేక అనుబంధం ఉంది.
ఈ తరుణంలో పుణెకు చెందిన ప్రణయ్ పాథోల్ కు ఎలాన్ మస్క్ తో విడదీయరాని సంబంధం ఉంది. హేట్ ఎలాన్ మస్క్ స్వీకరించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రణయ్ పాథోల్(Pranay Pathole) ట్విట్టర్ చీఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ అందుకున్న ద్వేషం అన్యాయమైనదని పేర్కొన్నారు.
టెక్ దిగ్గజాన్ని స్పూర్తిగా ఉన్నారని ప్రశంసించారు. ఎలాన్ మస్క్(Elon Musk) గొప్ప ఇంజనీర్లలో ఒకరుగా అభివర్ణించారు. మనిషి వాతావరణ మార్పు, పునర్వియోగ రాకెట్లు, అస్తిత్వ ప్రమాదాన్ని పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు ప్రణయ్ పాథోల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ట్రాఫిక్ , స్వేచ్ఛా ప్రసంగంతో ఆయన ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని స్పష్టం చేశారు.
తాజాగా పాథోల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పని చేస్తున్న టెక్ ఆంట్రప్రెన్యూర్ ఈ ఏడాది ఆగస్టు లో ఎలాన్ మస్క్ ని కలవాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ప్రతి రోజూ చిట్ చాట్ చేస్తున్నారు.
2018లో 19 ఏళ్ల వయస్సులో టెస్లా ఆటోమేటిక్ విండ్ షీల్డ్ వైపర్ లలోని లోపాన్ని ఎత్తి చూపారు. మొదటిసారిగా పాథోలికి ప్రతిస్పందించాడు.
Also Read : ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ ‘సుప్రీం’