Punjab CM Mann : పంజాబ్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ

హాజ‌రు కానున్న సీఎం కేజ్రీవాల్

Punjab CM Mann : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Punjab CM Mann) త‌న కేబినెట్ లో మ‌రికొంద‌రిని చేర్చుకోనున్నారు. ఇప్ప‌టికే కొలువు తీరిన వారితో కాకుండా ఇద్ద‌రు లేదా ముగ్గురికి ఛాన్స్ ఇవ్వ‌నున్నారు. భ‌గ‌వంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ స‌ర్కార్ పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ ను బుధ‌వారం ప్రమాణ స్వీకారోత్స‌వానికి స‌మ‌యం కోరింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హాజ‌రు కానున్నారు. ఇవాళ కొత్త‌గా మంత్రులు కొలువు తీర‌నున్న‌ట్లు స‌మాచారం.

ఆప్ ఎమ్మెల్యేలు బాల్క‌ర్ సింగ్ , గుర్కీత్ సింగ్ ఖుడియాన్ ల‌ను కొత్త‌గా కేబినెట్ లోకి తీసుకోనున్నారు. త‌న క్యాబినెట్ ను విస్త‌రించ‌నుంద‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా స్థానిక మంత్రి ఇంద‌ర్ బీర్ సింగ్ నిజ్జ‌ర్ మంత్రి మండ‌లికి రాజీనామా చేసిన‌ట్లు సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. సీఎం భ‌గ‌వంత్ మాన్ రాజీనామా ఆమోదం కోసం గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రీ లాల్ పురోహిత్ కు మంత్రి లేఖ‌ను పంపిన‌ట్లు తెలిపింది.

వ్య‌క్తిగ‌త ప‌నుల రీత్యా తాను ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని వెంట‌నే ఆమోదించాల‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ గ‌వ‌ర్న‌ర్ ను కోరారు. జ‌లంధ‌ర్ లోని క‌ర్తార్ పూర్ ఎమ్మెల్యే బాల్క‌ర్ సింగ్ , ముక్త్ స‌ర్ లోని లంబి స్థానం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ ఖుదియాన్ ల పేర్ల‌ను కేబినెట్ లో మంత్రులుగా చేర్చుకునేందుకు సీఎం ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం.

Also Read : Manipur Violence

Leave A Reply

Your Email Id will not be published!