Bhagwant Mann : మోదీని క‌లిసిన సీఎం భ‌గ‌వంత్ మాన్

రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి

Bhagwant Mann  : పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొత్త‌గా కొలువు తీరిన భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann )ఇవ‌ళ ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల గురించి ప్ర‌ధానితో ప్ర‌స్తావించారు.

సీఎంగా ప్ర‌మాణం త‌ర్వాత ఇదే మొద‌టిసారి హ‌స్తిన‌కు రావ‌డం. భార‌త దేశానికి సంబంధించిన త్రివిధ ద‌ళాల‌లో పంజాబీలు ఏ ర‌కంగా సేవ‌లు చేస్తున్నారో తెలియ చేశారు.

అంతే కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంజాబ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాల‌ని విన్న‌వించారు. ఈ మేర‌కు ఆయ‌న రాష్ట్రం త‌ర‌పున ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ముందుంచారు.

ఈ మేర‌కు గౌర‌వ‌నీయ ప్ర‌ధాన మంత్రి మోదీకి లేఖ అంద‌జేశారు. ప్ర‌ధానిని క‌లిసిన అనంత‌రం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann )మీడియాతో మాట్లాడారు. తాను సీఎంగా ఈనెల 16న ప్ర‌మాణ స్వీకారం చేశాన‌ని , ఆ త‌ర్వాత పీఎంను ఇవాళ క‌లిసాన‌ని చెప్పారు.

తాను గతంలో సింగ్రూర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల గురించి అనేక సార్లు తాను ప్ర‌స్తావించాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఆనాటి నుంచి నేటి దాకా త‌న‌కు ప్ర‌ధాని మోదీతో వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యం కూడా ఉంద‌ని తెలిపారు. గ‌తంలో పంజాబ్ రాష్ట్రాన్ని ఏలిన పాల‌కులు పూర్తిగా అప్పుల్లోకి నెట్టి వేశార‌ని ఈ త‌రుణంలో కేంద్రం రూ. 50 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాల‌ని ప్ర‌ధానిని కోరాన‌ని చెప్పారు.

అంతే కాకుండా జాతీయ భ‌ద్ర‌త‌ను కాపాడు కునేందుకు త‌మ‌కు కేంద్రం పూర్తిగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు. ప్ర‌తి ఏటా ఈ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల‌ని తెలిపామ‌న్నారు భ‌గ‌వంత్ మాన్.

Also Read : శరణార్ధుల ప్రవేశం దేశ భద్రత కేముప్పు

Leave A Reply

Your Email Id will not be published!