Punjab CM : అక్ర‌మార్కుల నుంచి 2,828 ఎక‌రాలు స్వాధీనం

ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ పై సీఎం ఫైర్

Punjab CM : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం సీఎం జాతీయ మీడియా ఎఎన్ఎంతో మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో ప్ర‌భుత్వాల‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆస్తుల‌ను అక్ర‌మంగా త‌మ పేరు మీద చేసుకున్నార‌ని ఆరోపించారు భ‌గ‌వంత్ మాన్.

తాము అధికారంలోకి వ‌చ్చాక అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోపామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి చెందిన వేలాది ఎక‌రాలు అన్యాక్రాంతం అయ్యాయ‌ని, అక్ర‌మార్కుల చేతుల్లో ఉన్నాయ‌ని గుర్తించామ‌న్నారు.

ఈ మేర‌కు ఎస్ఎఎస్ న‌గ‌ర్ లోని మ‌జ్రీ బ్లాక్ లో రూ. 350 కోట్ల విలువైన ప్ర‌భుత్వానికి చెందిన 2,828 ఎక‌రాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్. ప‌రుల , అక్ర‌మార్కుల చేతుల్లో బందీగా ఉన్న వాటిని వారి నుంచి విడిపించామ‌ని తెలిపారు.

ఇందులో ప్ర‌ధానంగా ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిమ్రంజిత్ సింగ్ మాన్ కుమారుడుతో స‌హా ప‌లువురు ప్ర‌భావంత‌మైన వ్య‌క్తులు ఈ భూముల‌ను ఆక్ర‌మించార‌ని ఆరోపించారు.

ఈ భూములు ఆయా గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోనివ‌ని, అంతే కాకుండా ప్ర‌భుత్వ అట‌వీ శాఖ‌కు చెందిన భూములు కూడా ఇందులో ఉన్నాయ‌ని తెలిపారు సీఎం(Punjab CM).

ఈ ఆక్ర‌మ‌ణ‌దారులు భూముల‌ను ఎలా ఆక్ర‌మించార‌నే దానిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 9,053 ఎక‌రాల భూముల‌ను ఆక్ర‌మ‌ణ‌దారుల నుంచి విడిపించామ‌న్నారు.

ఆయా పంచాయ‌తీలు, అట‌వీ శాఖ‌కు అప్ప‌గించామ‌ని వెల్ల‌డించారు భ‌గ‌వంత్ మాన్. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వానికి చెందిన ఆస్తులు ఎన్ని ఉన్నాయ‌నే దానిపై స‌ర్వే చేప‌డ‌తామ‌న్నారు సీఎం.

Also Read : న్యాయ సౌల‌భ్యం అత్యంత ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!