BJP Punjab Protest : పంజాబ్ సీఎం ముట్టడి ఉద్రిక్తం
బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి
BJP Punjab Protest : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన(BJP Punjab Protest) ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఆపై కంట్రోల్ కాక పోవడంతో వాటర్ క్యానన్స్ ఉపయోగించారు. ఇదిలా ఉండగా పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ, జీవన్ గుప్తా , సుభాష్ శర్మ సహా ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు బారికేడ్ల మీదుగా బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పెద్ద ఎత్తున చేరుకున్న కాషాయ శ్రేణులు మూకుమ్మడిగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) నివాసం వైపు ముట్టడించేందుకు ప్రయత్నం చేయడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.
ఆరు నెలల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపిస్తూ పంజాబ్ బీజేపీఈ సీఎం అధికారిక నివాసాన్ని ఘెరావ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు సీఎం నివాసం వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకునేందుకు ప్రయత్నం చేశారు కార్యకర్తలు. వాటర్ క్యానన్లను ప్రయోగించడంతో ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు.
మిగతా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైంది.
మాయమాటలు చెప్పిన ఆప్ ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ . మహిళలకు నెలకు రూ. 1,000 ఇస్తామన్నారు. డ్రగ్స్ , అవినీతిని కంట్రోల్ చేస్తామని చెప్పిన మాటలకు దిక్కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
Also Read : ప్రజలే ప్రభువులు గవర్నర్ కాదు – సీఎం