Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏకంగా తన మంత్రివర్గంలో కీలక పదవి చేపట్టిన ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను కేబినెట్ నుంచి తొలగించారు.
ఈ మేరకు ప్రకటన చేశారు. అధికారికంగా పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవలే పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో 92 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ.
రాజ్ భవన్ లో కాకుండా భగత్ సింగ్ పుట్టిన ఊరు కొంగర్ కలాన్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు భగవంత్ మాన్(Punjab CM). అంతే కాదు
ఎవరు అవినీతికి పాల్పడినా తాను సహించేది లేదంటూ ప్రకటించారు.
ఇందు కోసం కరప్షన్ ఫ్రీ (అవినీతి రహిత) స్టేట్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్
కూడా ఇచ్చారు. ప్రత్యేకించి తన నెంబర్ కూడా ప్రజలందరికీ స్పష్టం చేశారు.
ఎవరు లంచం అడిగినా వెంటనే తనకు మెస్సేజ్ కానీ లేదా వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని భగవంత్ మాన్(Punjab CM) కోరారు.
దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
పంజాబ్ సీఎం తీసుకున్న నిర్ణయాల పట్ల సానుకూలత లభించింది జనం నుంచి. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కలకలం రేపింది. అవినీతి నిరోధక ప్రభుత్వమని చెప్పకనే చెప్పారు.
ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించడంతో మంత్రి వర్గం నుంచి తొలగించినట్లు చెప్పారు. సింగ్లా
టెండర్లపై ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు తేలిందన్నారు.
మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 2015లో అరవింద్
కేజ్రీవాల్ తన మంత్రివర్గంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో మంత్రిని తొలగించారు.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ను గెలిపించారు. వారికి అనుగుణంగా జీవించాలని, భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై యుద్దం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
Also Read : పీకేకు మంగళం సునీల్ కు అందలం