Punjab CM Marriage : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన రెండో వివాహానికి సిద్దమయ్యారు. గతంలో భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. ఒక బాబు, పాప ఉన్నారు.
మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు మాన్. గురువారం పంజాబ్ సీఎం చండీగఢ్ లోని తన ఇంట్లో డాక్టర్ గురు ప్రీత్ కౌర్ తో ప్రైవేట్ కార్యక్రమంలో వివాహం చేసుకోనున్నారు(Punjab CM Marriage).
ఈ పెళ్లి వేడుకకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , తో పాటు కొందరు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా సీఎం భగవంత్ మాన్ దాదాపు ఆరేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం భగవంత్ మాన్ కు 49 ఏళ్లు ఉన్నాయి. వధువుకు సంబంధించి డాక్టర్. ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. చాలా ఏళ్ల నుంచి వీరిద్దరికీ చనువు, స్నేహం ఉందని తెలిసింది.
ఈ పెళ్లి వేడుకలకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నాయకులు, పంజాబ్ లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పెళ్లి వేడుకలకు హాజరు కానున్నారు.
మొదట భగవంత్ మాన్ ఇంద్ర ప్రీత్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. 2015లో వ్యక్తిగత కారణాల రీత్యా విడి పోయారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
అయితే విడాకులు తీసుకున్నా మాజీ భార్య, పిల్లలు భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కనిపించారు. వారితో మాన్ ఆప్యాయంగా ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం మాన్ కు తల్లి కూడా ఉంది.
Also Read : మహూవా మోయిత్రాపై కేసు నమోదు
Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back.
(file pic) pic.twitter.com/tC3Zd2LGfv
— ANI (@ANI) July 6, 2022