Punjab CM : అమ‌రులైన రైత‌న్న‌ల‌కు రూ. 39.55 కోట్లు

కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున పంపిణీ

Punjab CM :  సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన పోరాటంలో అమ‌రులైన రైతుల‌కు ఆర్థిక సాయం అంద‌జేసిన‌ట్లు ప్ర‌క‌టించారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్.

నిర‌స‌న స‌మ‌యంలో మ‌ర‌ణించిన మొత్తం 789 మంది రైతుల కుటుంబాల‌కు(Punjab CM)  రూ. 39.55 కోట్ల రూపాయ‌లు సాయం చేశామ‌న్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు.

శ‌నివారం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వం సాగు చ‌ట్టాల‌ను తీసుకు రావ‌డాన్ని పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు రైతులు. ప్రాణాలు కోల్పోయిన ప్ర‌తి కుటుంబాన్ని తాము ఆదుకుంటామ‌ని ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు సీఎం.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన అలుపెరుగ‌ని రీతిలో సాగిన పోరాటంలో తీవ్ర‌మైన చ‌లి కాలం, రోడ్డు ప్ర‌మదాలు, ప్ర‌మాద‌వ‌శాత్తు గుండె పోటుతో గురై రైతులు చ‌ని పోయారని తెలిపారు భ‌గ‌వంత్ మాన్.

ఇత‌ర వ్యాధుల కార‌ణంగా మ‌రికొంద‌రు రైతులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పంజాబ్ సీఎం వెల్ల‌డించారు. రైతులు, వారి కుటుంబాల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

అధికారికంగా చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం వారికి ఇచ్చిన ప్ర‌తి వాగ్ధానాన్ని నెర వేరుస్తామ‌ని చెప్పారు సీఎం. అంతే కాకుండా ప్ర‌స్తుత వ్య‌వ‌సాయ సంక్షోభం నుంచి రైతుల‌ను గ‌ట్టెక్కించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు భ‌గ‌వంత్ మాన్.

తమ స‌ర్కార్ ప‌చ్చి మిర్చి రూపంలో ప్ర‌త్యామ్నాయ పంట‌ను ప్ర‌వేశ పెట్టింద‌ని వెల్ల‌డించారు. క‌న‌స మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం. నేరుగా వ‌రి నాట్లు వేసే రైతుల‌కు ఆర్థిక సాయం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Also Read : రాముడి పేరుతో రావ‌ణుడికి పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!