Punjab CM : 424 ప్రముఖులకు సెక్యూరిటీ పునరుద్దరణ
ప్రకటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Punjab CM : ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా దారుణ హత్యకు గురి కావడంతో పంజాబ్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఆప్ సర్కార్ పవర్ లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 424 మందికి ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్(Punjab CM).
ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ సీఎంలు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న భద్రతను తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఇదే సమయంలో సెక్యూరిటీ తొలగించిన వెంటనే 10 మంది సాయుధులైన దుండగులు మాన్సా జిల్లాలలో ఎస్వీయూ వాహనంలో తన అనుచరులతో కలిసి బయలు దేరిన సిద్దూ మాన్సే వాలాపై కాల్పులకు తెగబడ్డారు.
ఏకంగా 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఆయనను చికిత్స నిమిత్తం తరలించగా ఘటన జరిగిన చోటే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం భగవంత్ మాన్(Punjab CM) తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాన్సా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయ్ సింగ్లా చేతిలో ఓడి పోయాడు.
సిద్దూకు ఉన్న సెక్యూరిటీని తొలగించిన మరుసటి రోజే కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఎం భగవంత్ మాన్ పునరాలోచించారు.
ఈ మేరకు ప్రముఖులకు తొలగించిన భద్రతను తిరిగి పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : ఎమ్మెల్యేలు జారి పోకుండా కాంగ్రెస్ ఫోకస్