Punjab CM : ప్రజలే ప్రభువులు గవర్నర్ కాదు – సీఎం
నిప్పులు చెరిగిన భగవంత్ మాన్
Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలని, వారే ప్రభువులని గవర్నర్ కాదని స్పష్టం చేశారు.
డాక్టర్ బాబా సాహెబ్ రాసిన భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిన ఘనత గవర్నర్ దేనని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా నిలిపి వేయాడన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
సెప్టెంబర్ 27న శాసనసభ సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు పంజాబ్ సీఎం(Punjab CM). విశ్వాస తీర్మానం తీసుకు రావడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలన్ని భగవంత్ మాన్ పాలనా ప్లాన్ ను గవర్నర బన్వరీలాల్ పురోహిత్ తిప్పికొట్టారు. దానిని ఆయన తిరస్కరించారు.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను గవర్నర్ ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో 27న విధానసభ సమావేశాన్ని నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పారు గురువారం భగవంత్ మాన్.
ఈ సమావేశాల్లో విద్యుత్, తదితర సమస్యలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు సీఎం(Punjab CM). ప్రత్యేక సెషన్ ను పిలుస్తూ ఉత్తర్వులను ఉపసంహరించు కోవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
పంజాబ్ లోని ఆప్ సర్కార్ ను బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆప్ ఆరోపించింది.
ఆపరేషన్ లోటస్ పేరుతో ఆరు నెలల ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్ల ఆఫర్ తో తమ ఎమ్మెల్యేలలో 10 మందిని బీజేపీ సంప్రదించిందంటూ ఆప్ ఆరోపించింది.
ఒక రకంగా డెమోక్రసీని గవర్నర్ ఖూనీ చేశారంటూ ఆరోపించారు భగవంత్ మాన్.
Also Read : మసీదును సందర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్