Punjab CM : సిద్దూ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
భారీ భద్రత మధ్య భగవంత్ మాన్ ఎంట్రీ
Punjab CM : ప్రముఖ సింగర్ సిద్దూ మాసే వాలా దారుణ హత్య అనంతరం శుక్రవారం పంజాబ్ సీఎం(Punjab CM) భగవంత్ మాన్ ఆయన కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి భరోసా ఇచ్చారు.
పంజాబ్ లోని మాన్సా జిల్లాలో గత వారం సిద్దూ మూసే వాలాను కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయనపై 32 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించే లోపే చని పోయాడు.
ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడే ఒక రోజు కంటే ముందు పంజాబ్ సీఎం(Punjab CM) భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 424 మందికి కల్పించిన భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సెక్యూరిటీ తొలగించిన ఒక రోజు తర్వాత సిద్దూ మాసే వాలాపై కాల్పులకు తెగబడ్డారు.
దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. హర్యానా, పంజాబ్ కోర్టు సీరియస్ అయ్యింది. ఎందుకు ఏ కారణం తో సెక్యూరిటీ తొలగించారో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
దీంతో తొలగించిన ప్రముఖులకు తిరిగి భద్రత కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది కోర్టుకు. సిద్దూపై కాల్పులకు తెగబడిన తర్వాత ఇవాళ సీఎం భగవంత్ మాన్ సందర్శించారు.
మాన్సా జిల్లాలోని స్వంత ఊరు మూసాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మూసా వాలా కుటుంబం కూడా మాన్ సర్కార్ పై ఫైర్ అయ్యింది.
మా బిడ్డ మరణంతో మీ ఖజానా నిండుతుందా అని సిద్దూ తల్లి చరణ్ కౌర్ ఆగ్రహంతో ప్రశ్నించింది.
Also Read : 424 ప్రముఖులకు సెక్యూరిటీ పునరుద్దరణ