Punjab CM : విద్యుత్ ఆదా కోసం సీఎం నిర్ణయం
కేవలం ఒంటి పూట ఆఫీసులు మాత్రమే
Punjab CM : ఎండా కాలం వచ్చిందంటే చాలు ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది. డిమాండ్ కు సరిపడా సప్లై ఉండదు. దీంతో ఇతర కంపెనీలపై ఆధారపడక తప్పదు. కోట్లాది రూపాయల భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. తిరిగి ఛార్జీలు, అదనపు సర్వీసుల పేరుతో వినియోగదారులపై మోత తప్పదు.
దీనిని గమనించిన పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM) కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను రాష్ట్రంలోని అన్ని ఆఫీసులను కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. దీని వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీని వల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుంచి ఉదయం 7.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడుస్తాయని పేర్కొన్నారు. ఈ విధానం వచ్చే నెల మే 2 నుంచి జూలై 15 వరకు కొనసాగుతుందని వెల్లడించింది సర్కార్. దీని వల్ల కరెంట్ ఆదాతో పాటు ఉద్యోగులు తమ కుటుంబీకుల వద్ద గడిపేందుకు సమయం కూడా ఉంటుందని పేర్కొన్నారు సీఎం భగవంత్ మాన్. సీఎం నిర్ణయంతో ఉద్యోగులు తెగ ముచ్చట పడుతున్నారు.
Also Read : జేడీఎస్ లో చేరనున్న కాంగ్రెస్ నేతలు