Punjab Health Secretary : ప్ర‌చారం కోసం రూ. 30 కోట్లు ఖ‌ర్చు

హెల్త్ సెక్ర‌ట‌రీ అజోయ్ పై వేటు

Punjab Health Secretary : పంజాబ్ లో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఢిల్లీ త‌ర‌హా మొహ‌ల్లా క్లినిక్ ల‌ను ఏర్పాటు చేసింది. కాగా వీటికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కోసం ఏకంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 30 కోట్లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. చివ‌ర‌కు దీనిపై రాద్దాంతం చెల‌రేగ‌డంతో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ స్వ‌యంగా రంగంలోకి దిగారు.

దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ ఎత్తున కేవ‌లం ప్ర‌చారం కోసం ఖ‌ర్చు చేయ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం కావ‌డంతో రాష్ట్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి అజోయ్ కుమార్ ను బ‌దిలీ చేసింది. ఆయ‌న‌పై వేటు వేయాల‌ని సీఎం కోరిన‌ట్లు తెలిసింది. మ‌రో వైపు అవినీతి ఆరోప‌ణ‌లు భారీ ఎత్తున రావ‌డంతో ఆయ‌న‌ను తొల‌గించిన‌ట్లు కూడా ప్రచారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా మ‌రో క‌థ‌నం కూడా బ‌య‌ట విన‌ప‌డుతోంది. భార‌త దేశంలోని రాష్ట్రాల్లోని మొహ‌ల్లా క్లినిక్ల ప్ర‌చారానికి రూ. 30 కోట్ల ఖ‌ర్చును అనుమ‌తించేందుకు నిరాక‌రించినందు వ‌ల్ల‌నే ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శిని తొల‌గించిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. పంజాబ్ స‌ర్కార్ క్లినిక్ ల కోసం కేవ‌లం రూ. 10 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని పేర్కొంది.

అజోయ్ కుమార్ శ‌ర్మ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ,(Punjab Health Secretary) ఫైనాన్స్ క‌మిష‌న్ కు క‌మిష‌న‌ర్ గా రెండు ప‌ద‌వుల్లో ఉన్నారు. ఆ రెండింటి నుంచి ఆయ‌న‌ను తొల‌గించారు సీఎం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు మ‌రో శాఖ కేటాయించ లేదు. వీకే మీనా ప్ర‌స్తుతం ఆరోగ్య శాఖ‌ను నిర్వ‌హిస్తుండగా వికార్ ప‌ర్తాఫ్ ఫైనాన్స్ క‌మిష‌న‌ర్ గా విధులు న‌ర్వ‌హిస్తున్నారు.

Also Read : జ‌మ్మూ కాశ్మీర్ ఎన్నిక‌ల్లో ఆప్ పోటీ

Leave A Reply

Your Email Id will not be published!