Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ ఒకే ఒక పెన్షన్ సౌకర్యాన్ని వర్తింప చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారం పడదని పేర్కొన్నారు.
కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు రూ. 3.50 లక్షల నుంచి రూ. 5. 25 లక్షల వరకు పెన్షన్ పొందుతున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ సాక్షిగా ఈ కీలక నిర్ణయం ప్రకటించారు భగవత్ మాన్(Bhagwant Mann).
చట్టాన్ని రూపొందించే వారందరికీ కేవలం ఒక పెన్షన్ సౌకర్యం వర్తింప చేయాలని స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఎమ్మెల్యేల కుటుంబ పెన్షన్ కూడా కోత విధించారు.
అనేక మంది ఎమ్మెల్యేలు విధాన సభలో ప్రజా ప్రతినిధులుగా పని చేస్తున్న ప్రతి టర్మ్ కు బహుళ పెన్షన్లు పొందుతున్నారని ,
దీంతో ఎవరైనా సరే ఎన్ని సార్లు ఎన్నికైనా ఒకే పెన్షన్ సౌకర్యం, విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్బంగా కొందరి పేర్లను కూడా ఆయన ఉదహరించారు. లాల్ సింగ్ , సర్వన్ సింగ్ ఫిల్లౌర్ , రాజిందర్ కౌర్ భట్టల్ నెలవారీ పెన్షన్ రూ. 3.25 లక్షలు పొందుతున్నారని మండిపడ్డారు.
రవి ఇందర్ సింగ్ , బల్విందర్ సింగ్ నెల వారీగా రూ. 2.75 లక్షల పెన్షన్ పొందుతున్నారని సీరియస్ అయ్యారు. అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ తన పెన్షన్ వదులుకుంటున్నట్లు ప్రకటించకుంటే నెలకు రూ. 5 లక్షలకు పైగా పెన్షన్ వచ్చేదన్నారు.
రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళుతున్నారు. సేవ పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ ఆరోపించారు. కాగా మూడు లేదా ఐదుసార్లు ఎన్నికైన వారు లక్షలాది రూపాయలు పెన్షన్ పేరుతో పొందుతున్నారని దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందంటూ పేర్కొన్నారు సీఎం.
కొందరు ఎంపీలుగా గెలుపొందారు. వారు కూడా ఇలాగే పెన్షన్ పొందుతున్నారని దీనిని కూడా తాము తొలగిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా పొదుపు చేసిన సొమ్మును ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు.
Also Read : యోగి కేబినెట్ లో ఇద్దరూ డిప్యూటీ సీఎంలు