Punjab PCC Chief : కేజ్రీవాల్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఫైర్

ల‌క్ష్మి..గ‌ణ‌పతి స‌రే అంబేద్క‌ర్ వ‌ద్దా

Punjab PCC Chief : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. భార‌త క‌రెన్సీపై మ‌హాత్మా గాంధీ తో పాటు ల‌క్ష్మి, గ‌ణ‌ప‌తి ఫోటోల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ కూడా రాస్తాన‌ని తెలిపారు.

దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాలు, నేత‌లు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. మ‌హాత్మా గాంధీ స‌రే ఎందుకు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ఫోటోను ముద్రించ కూడ‌దంటూ ప్ర‌శ్నించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేర‌కు నిప్పులు చెరిగారు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌నీష్ తివారీ.

భార‌త దేశానికి సంబంధించి రాజ్యాంగాన్ని త‌యారు చేసిన అంబేద్క‌ర్ ఫోటో ఎందుకు పెట్ట కూడ‌ద‌ని నిల‌దీశారు. మ‌రో వైపు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమ‌రీంద‌ర్ సింగ్ రాజా(Punjab PCC Chief)  ఎన్నిక‌ల స‌మ‌యంలో గుజ‌రాత్ లో ఓట్లు కొల్ల‌గొట్టేందుకు ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు.

ఇవాళ రాజ్యాంగం ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉంద‌ని దానిని ర‌చించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన బీఆర్ అంబేద్క‌ర్ ను ఎందుకు విస్మ‌రించాడో దేశానికి చెప్పాల‌న్నారు పంజాబ్ పీసీసీ చీఫ్‌. హిందూవుల ఓట్ల‌ను కొల్లగొట్టే ప‌నిలో కేజ్రీవాల్ ప‌డ్డారంటూ ఆరోపించారు.

అహంస‌, రాజ్యాంగ‌వాదం, స‌మ‌తా వాదం ఒక ప్ర‌త్యేక‌మైన యూనియ‌న్ లో క‌లిసి పోయాయ‌ని దీనికి గాంధీ, అంబేద్క‌ర్ ఎందుకు ప్రాధాన్య‌త క‌ల్పించ‌లేద‌న్న ప్ర‌శ్న ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : ఎల్జీ స‌క్సేనాపై ఆప్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!