Tajinder Singh Pal Bagga : ఢిల్లీలో ఆప్ , బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకుడు తాజిందర్ బగ్గాకు షాక్ ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక పోతే తాజిందర్ బగ్గా(Tajinder Singh Pal Bagga) బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. పంజాబ్ లోని మొహాలీకి చెందిన ఆప్ పార్టీ నాయకుడు సన్నీ ఆహ్లూవాలియా ఫిర్యాదు చేశారు.
అందుకే నమోదు చేశామని తెలిపారు. తప్పుడు సమాచారం ఆధారంగా మతాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు రెచ్చ గొట్టేలా , మత సామరాస్యాన్ని కావాలని దెబ్బ కొట్టేందుకు వ్యవహరించారంటూ ఆరోపించారు ఫిర్యాదులో.
తాజిందర్ పాల్ సింగ్ బగ్గాపై కేసు నమోదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. బగ్గా ఇలాంటి వ్యాఖ్యలే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కూడా అత్యంత అవమానకరంగా కామెంట్స్ చేశారంటూ ఆప్ ఆరోపించింది.
ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లారని సమచారం. ఆయన అందుబాటులో లేక పోవడంతో వెనుదిరిగారు.
ఒక్క ఢిల్లీతో పాటు పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తాజిందర్ పాల్ సింగ్ బగ్గాపై కేసులు నమోదు పెద్ద ఎత్తున అయ్యాయి. ఇదిలా ఉండగా సైబర్ క్రైంలో కూడా కేసులు నమోదు చేసినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు.
తాజిందర్ సింగ్ పాల్ బగ్గా దీనిపై స్పందించాడు. తనపై కావాలని ఆప్ కేసు నమోదు చేయించిందంటూ ఆరోపించారు.
Also Read : ఊపిరి ఉన్నంత వరకు పొరాటమే