Punjab Schools : పంజాబ్ లో విద్యా విప్లవం
హ్యాట్సాఫ్ భగవంత్ మాన్
Punjab Schools : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కొలువు తీరిందో ఆనాటి నుంచి విద్యా రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులను ఈ రంగానికే కేటాయించారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఆయన తండ్రి పంతులు. చదువు విలువ ఏమిటో బాగా తెలుసని ప్రతిసారి చెబుతూ వచ్చారు సీఎం.
Punjab Schools Development
ముందు బడులు కార్పొరేట్ స్కూళ్లను దాటి పోవాలి. మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు భగవంత్ మాన్. పంజాబ్ లో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడిలోనే చదువు కోవాలని ఇందుకు సంబంధించి పూర్తిగా వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు భగవంత్ మాన్.
దశల వారీగా తరగతి గదులను, బడులను సమూలంగా మార్చేస్తున్నారు సీఎం. ఇందుకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతే కాదు టీచర్లు, హెడ్మాస్టర్లు, ఇతర నైపుణ్యం పొందిన వారందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఒక రకంగా ఇది ఓ సంచలనమేనని చెప్పక తప్పదు. తాజాగా ఆయా బడుల్లో కొత్తగా టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేశారు. దీనిని ఆప్ ట్విట్టర్ లో పంచుకుంది.
Also Read : RS Praveen Kumar : స్పోర్ట్స్ స్కూల్ లో పశువుల డాక్టరా