Pushpa Ganesha : ‘పుష్ప గ‌ణేషా’ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

అల్లు అర్జున్ పుష్ప‌ మూవీకి త‌గ్గ‌ని క్రేజ్

Pushpa Ganesha :  భార‌త దేశ‌మంత‌టా బుధ‌వారం వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. ఎక్క‌డ చూసినా వినాయ‌క విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు. పెద్ద ఎత్తున పూజ‌లు చేశారు.

ఇక అభిమానులు, త‌యారీదారులు త‌మ‌కు తోచిన మేర విగ్ర‌హాల‌ను త‌యారు చేయించారు. ప్ర‌ధానంగా దేశ వ్యాప్తంగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ, ర‌ష్మిక మందాన క‌లిసి న‌టించిన పుష్ప మూవీ దుమ్ము రేపింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంది. భారీ ఎత్తున క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. అంతే కాదు బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది ఈ ఒక్క మూవీ. ప్ర‌స్తుతం ఎవ‌రు చూసినా ఈ మూవీ గురించే ప్ర‌స్తావిస్తున్నారు.

ప్ర‌ధానంగా పాట‌ల‌తో పాటు డైలాగ్ లు జ‌నాన్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇందులోని త‌గ్గేదేలే అన్న డైలాగ్ ఒన్స్ మోర్ అనేలా చేసింది. సెలిబ్రిటీలు, స్టార్స్ , ఇత‌ర రంగాల‌కు చెందిన వారు కూడా ఈ డైలాగ్ తో పాపుల‌ర్ అయి పోయారు.

తాజాగా వినాయ‌క చ‌వితిని పురస్క‌రించుకుని ఏకంగా పుష్ప మేన‌రిజంతో ఉన్న వినాయ‌కుడిని త‌యారు చేశారు. ప్ర‌స్తుతం పుష్ప గ‌ణేషా(Pushpa Ganesha) సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారింది.

ఎక్క‌డ చూసినా ఈ ఫోటోపై భారీగా స్పందిస్తున్నారు. సినీ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు సైతం సూప‌ర్ అంటూ కితాబు ఇస్తున్నారు.

పుష్ప గ‌ణేషా కూడా బ‌న్నీ లాగానే దుస్తుల‌తో ఉండ‌డం ఈ విగ్ర‌హం ప్ర‌త్యేక‌త‌. ఎంతైనా పుష్ప మేనియా చివ‌ర‌కు దేవుళ్ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు.

Also Read : ఘ‌నంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్ర‌దానం

Leave A Reply

Your Email Id will not be published!