Pushpa Movie : అంత‌టా పుష్ప సాంగ్స్ మేనియా

యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1

Pushpa Movie : పాన్ ఇండియా మూవీగా రిలీజైన ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప మూవీ పాట‌ల ప‌రంగా ఇప్ప‌టికే అన్ని భాష‌ల్లో టాప్ లో కొన‌సాగుతోంది. ఇక హిందీలో సైతం విడుద‌ల చేసిన పుష్ప మూవీ(Pushpa Movie) సాంగ్స్ టాప్ లో ఉండ‌డం విశేషం.

దీనిని టీ సీరీస్ రిలీజ్ చేసింది సంగీతం భాషా అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తుంది అని చెప్పేందుకు ఈ చిత్రం ఓ నిద‌ర్శ‌న‌మ‌న్నారు టీ సీరీస్ అధినేత భూష‌ణ్ కుమార్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మంద‌న్నా, స్పెష‌ల్ సాంగ్ లో సూప‌ర్ సమంతా క‌లిసి న‌టించిన పుష్ప మూవీ (Pushpa Movie)బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికే రూ. 300 కోట్ల‌కు పైగా గ్రాస్ సాధించిన‌ట్లు సినీ వ‌ర్గాల టాక్.

పుష్ప‌ను తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మల‌యాళం భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. విడుద‌లైన అన్ని భాష‌ల్లో తుగ్గు రేపుతోంది.

ప్ర‌త్యేకించి ద‌ర్శ‌కుడి టేకింగ్ , బ‌న్నీ అసాధార‌ణ న‌ట‌న‌కు తో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పాట‌లు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఓ ఊపు ఊపుతున్నాయి.

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పుష్ప మూవీకి సంబంధించిన మీమ్స్ కూడా తెగ ట్రోల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో శ్రీ‌వ‌ల్లి ట్రెండింగ్ లో నెంబ‌ర్ 1 గా ఉంది. ఊ బోలేగా యా ఊ ఓ బోలేగా 2వ స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక సామి సామి 4వ ప్లేస్ లో కొన‌సాగుతోంది. రాక్ స్టార్ డీఎస్పీతో క‌లిసి ప‌ని చేయ‌డం త‌మ‌కు ఆనందంగా ఉంద‌న్నారు టీ సీరీస్ చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ భూష‌ణ్ కుమార్.

Also Read : వారెవ్వా రామ్ ‘ది వారియ‌ర్’

Leave A Reply

Your Email Id will not be published!