Putin Praises : మోదీ నాకు చిరకాల మిత్రుడు – పుతిన్
ప్రధానమంత్రికి రష్యా చీఫ్ ప్రశంస
Putin Praises : అంతర్గత పోరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. తనకు అత్యంత కావాల్సిన మిత్రుడు మోదీ అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రష్యాకు చెందిన ఏఎస్ఐ మాస్కోలో నిర్వహించిన ఫోరమ్ లో పుతిన్ ప్రసంగించారు. మోదీ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉంటాయని పేర్కొన్నారు. తాను ఆస్వాదిస్తానని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ను ఆయన స్వాగతించారు. ఇది ప్రతి దేశానికి అవసరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత దోహద పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అంతర్గత కలహాలు, తిరుగుబాట్లు ఏ దేశంలోనైనా సహజంగానే ఉంటాయని పేర్కొన్నారు. తనను ప్రశ్నిస్తూ , వ్యతిరేకిస్తూ కిరాయి సైనికులు తిరుగుబాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇలాంటి సంఘటనలు తాను చాలా చూశానని చెప్పారు పుతిన్(Putin). దీనిని తాను పట్టించుకోనని పేర్కొన్నారు. ఎవరు ఉండి చేయిస్తున్నారో వారే చివరకు అంతం అవుతారని అది త్వరలోనే జరుగుతుందని స్పష్టం చేశారు వ్లాదిమీర్ పుతిన్. ప్రస్తుతం భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం కూడా బాగుందని మెచ్చుకున్నారు రష్యా చీఫ్. మొత్తానికి ఏదో జరుగుతోందని భావించిన ప్రపంచానికి తానే సుప్రీం అని మరోసారి నిరూపించారు పుతిన్.
Also Read : YS Sharmila : పాలనలో వైఎస్ బెస్ట్ కేసీఆర్ లాస్ట్