Puvvada Ajay Kumar : ఆర్టీసీకి ఢోకా లేదు – పువ్వాడ
కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
Puvvada Ajay Kumar : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుతం కూల్ గా పని చేసుకుంటూ పోతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు , విమర్శలలో పస లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర సర్కార్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. దీంతో విపక్షాలకు ఏం చేయాలో పాలు పోక తికమక పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Puvvada Ajay Kumar Slams Opposition Parties
ఆర్టీసీని అమ్మేస్తే రూ. 1,000 కోట్లు ఇస్తామని మోదీ కేంద్ర సర్కార్ ఆఫర్ ఇచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు పువ్వాడ అజయ్(Puvvada Ajay Kumar) . కానీ తాము లొంగ లేదని, ఒప్పు కోలేదన్నారు. పేద వర్గాలకు మరింత మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలని సీఎం ముందు నుంచి చెబుతూ వస్తున్నారని, చివరకు తాను చెప్పినట్టే చేశారని అన్నారు.
ఆర్టీసీని అమ్మకుండా దాని ఆత్మ గౌరవాన్ని కాపాడారని కొనియాడారు. ఆయన చలవ వల్లనే ఇవాళ ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తుంటే తాము మాత్రం నిలబెట్టామన్నారు.
Also Read : Nara Lokesh Police : పోలీసులపై వైకాపా దాడి దారుణం