Puvvada Ajay Kumar : పొంగులేటి నోరు జర జాగ్రత్త – పువ్వాడ
మంత్రి అజయ్ కుమార్
Puvvada Ajay Kumar : తాను ఓ బచ్చా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పొంగులేటికి అంత సీన్ లేదని అన్నారు. ఆరు నూరైనా సరే తనను కాదు కదా ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే దరి దాపుల్లోకి రాలేవని హెచ్చరించారు.
ఎదుటి వ్యక్తులపై నోరు పారేసుకునే ముందు ఆచి తూచి మాట్లాడటం నేర్చు కోవాలన్నారు పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar). ఇంకోసారి నోరు జారితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తాము గతంలో వచ్చిన మెజారిటీ కంటే భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో గతంలో వచ్చిన ఎమ్మెల్యేల స్థానాల కంటే మొత్తానికి మొత్తం స్థానాలు గెలుపొందుతామని పేర్కొన్నారు. పొంగులేటి స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, పార్టీలో ఉంటూ ఏం చేశాడో జనాలకు బాగా తెలుసున్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కరు ఆయనను నమ్మరంటూ పేర్కొన్నారు. పొంగులేటి ఏ పార్టీలోకి పోయినా ఆ పార్టికి భవిష్యత్తు అంటూ ఉండదని ఎద్దేవా చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
Also Read : Ponguleti Srinivas Reddy : పువ్వాడ ఓ బచ్చా – పొంగులేటి
