PM Modi : క్వీన్ ఎలిజ‌బెత్ భార‌త్ కు ట్రూ ఫ్రెండ్

గొప్ప స్నేహితురాలిని కోల్పోయాం

PM Modi :  96 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన క్వీన్ ఎలిజ‌బెత్ కు(Queen Elizabeth II) ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్య‌క్తం అవుతోంది. ఈ సంద‌ర్భంగా క్వీన్ ఎలిజ‌బెత్ భార‌త‌దేశానికి నిజ‌మైన స్నేహితురాలు అని పేర్కొంది భార‌త దేశం.

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ఈసంద‌ర్భంగా ఆమె మృతికి సంతాపం వ్య‌క్తం చేశారు. క్వీన్ ఎలిజ‌బెత్ మ‌ర‌ణం ఇంగ్లాండ్ కు, ప్ర‌పంచానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలం పాటు బ్రిట‌న్ కు ప‌ని చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ప్రిన్స్ ఎలిజబెత్ తో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

బ్రిటీష్ సింహాస‌నానికి వార‌సుడిగా ఎంపికైన కింగ్ చార్లెస్ ను అభినందించారు. ఇది ఇంగ్లాండ్ ప్ర‌జ‌ల‌కు , ప్రపంచానికి తీర‌ని లోటు. ఆమె చాలా సున్నిత‌మైన వ్య‌క్తి అని. ప్ర‌థ‌మ‌, ఉక్కు మ‌హిళ‌గా పేరొందార‌ని ప్ర‌శంసించారు.

నేను కింగ్ చార్లెస్ రాబోయే రోజుల్లో స‌మ‌ర్థ‌వంతంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. రాచ‌రికాన్ని స్వీక‌రించ‌డంపై గోయ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా మొద‌టి ఇండో ప‌సిఫిక్ ఎక‌నామిక్ ఫ్రేమ్ వ‌ర్క్ (ఐపీఇఎఫ్) మంత్రివ‌ర్గ స‌మావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో శాన్ ఫ్రాన్సిస్కో , లాస్ ఏంజిల్స్ లో ఉన్నారు.

కాగా స‌మావేశానికి ముందు యుఎస్ వాణిజ్య ప్ర‌తినిధి కేథ‌రిన్ తాయ్ ను క‌లిశారు. ఇదిలా ఉండ‌గా యావ‌త్ ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి సంతాప సందేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. బ్రిటీష్ రాణి మృతి ప‌ట్ల దేశాధినేత‌లు, ప్ర‌ధాన‌మంత్రులు సంతాపం తెలిపారు.

Also Read : ప్రిన్స్ ఎలిజ‌బెత్ స్థానంలో చార్లెస్

Leave A Reply

Your Email Id will not be published!