Queen Elizabeth II Funeral : క్వీన్ -2 కోసం తరలి వచ్చిన నేతలు
రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు నేడు
Queen Elizabeth II Funeral : యునైటెడ్ కింగ్ డమ్ కు 70 ఏళ్ల పాటు సుదీర్గ కాలంగా పాలించిన క్వీన్ ఎలిజబెత్ -2 కన్ను మూసిన సంగతి విదితమే. 96 ఏళ్ల వయస్సు కలిగిన క్వీన్ కు ఇవాళ అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలుకనున్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అధినేతలు, ప్రధానమంత్రులు, ఇతర ఉన్నాధికారులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మంది లండన్ కు చేరుకున్నారు.
యుకె సర్కార్ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. క్వీన్ ఎలిజబెత్ 70 సంవత్సరాల 214 రోజుల పాటు పాలించారు. ప్లాటినం జూబ్లీని జరుపుకున్న మొదటి బ్రిటిష్ సార్వభౌమాధికారిగా బ్రిటన్ చరిత్రలో నిలిచి పోయారు.
ఆమె కామన్వెల్త్ చీఫ్ గా ప్రపంచ దేశాలతో సత్ సంబంధాలు నెరపడంలో కీలక పాత్ర పోషించారు. క్వీన్ కోసం సంతాప సూచకంగా యుకెలో 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.
జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. 1965లో ఆమె మొదటి ప్రధాని విన్ స్టన్ చర్చిల్ మరణించిన తర్వాత బ్రిటన్ లో తొలిసారిగా క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు(Queen Elizabeth II Funeral) లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో సోమవారం జరగనున్నాయి.
ప్రపంచ నాయకులు, బ్రిటన్ రాచ కుటుంబం, రాజకీయ ప్రముఖులు, సైనిక, న్యాయ వ్యవస్థ, స్వచ్చంధ సంస్థల సభ్యులు అంత్యక్రియలకు చేరుకుంటారు.
బ్రిటన్ లోని 125 సినిమా థియేటర్లలో లైవ్ కాస్ట్ చేస్తారు. ఇదిలా ఉండగా స్కాట్లాండ్ యార్డ్ కు సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా 2,000 మందికి పైగా అధికారులను నియమించారు.
యూరోపియన్ యూనియన్ , ఫ్రాన్స్, జపాన్ , భారత దేశంతో పాటు ఇతర అనేక దేశాల నాయకులు హాజరవుతున్నారు. రష్యా, ఆఫ్గనిస్తాన్ , మయన్మార్ , సిరియా, ఉత్తర కొరియాలకు ఆహ్వానం పంపలేదు.
Also Read : కింగ్ చార్లెస్ ను కలుసుకున్న ప్రెసిడెంట్