Teesta Setalvad : దేశంలో ప్రశ్నించడం నేరం – సెతల్వాద్
తప్పు చేయకుండానే అభియోగాలు మోపారు
Teesta Setalvad : దేశంలో ప్రశ్నించడం నేరంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మానవ హక్కుల నాయకురాలు తీస్తా సెతల్వాద్. ఇప్పటికే ఆల్ట్ చెక్ కో ఫౌండర్ మహమ్మద్ జుబైర్ కేసు కూడా తనలాంటిదేనని పేర్కొన్నారు.
తనను అరెస్ట్ చేసేకంటే ముందు కొన్ని నోటీసులు ఇచ్చానని చెప్పారు. ఏడు రోజులు పోలీసు కస్టడీలో ఉన్నారు. సెతల్వాద్(Teesta Setalvad) కొన్నేళ్ల పాటు ప్రజల కోసం పని చేస్తున్నారు. సమస్యలపై నిలదీస్తున్నారు.
2002లో అలర్ల తర్వాత గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సెతల్వాద్ ను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం రోజుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే తనను ప్రశ్నించారని అన్నారు.
ప్రస్తుతం ఆమెకు 60 ఏళ్లు ఉన్నాయి. శనివారం చెరసాల నుండి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్ ను విచారించేందుకు ఇప్పటికే పోలీసులకు తగినంత సమయం ఉందన్నారు.
బెయిల్ మంజూరు చేయలేని కోర్టుపై ఈ కేసులో ఎటువంటి నేరం లేదన్నారు. జైలు నుండి బయకు వచ్చాక జాతీయ మీడియాతో మాట్లాడారు.తీస్తా జూన్ 25న తనను అరెస్ట్ చేసేందుకు ముందు డ్యుప్రాసెస్ , కొన్ని నోటీసులను ఊహించినట్లు చెప్పారు సెతల్వాద్.
ఇదిలా ఉండగా పోలీసు కస్టడీ చాలా విచిత్రంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి.
ఆ చట్టాలను పోలీసులు కొంత వరకు నిజాయితీ, నిష్పక్షపాతం , స్వయం ప్రతిపత్తితో వర్తింప చేయాలన్నారు. పోలీసులు కార్యనిర్వాహక శాఖగా మార కూడదన్నారు.
Also Read : భారత్ తో బంగ్లా చిరకాల స్నేహం – హసీనా