Qin Gang Jai Shankar : స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లో చెక్

భార‌త్ , చైనా విదేశాంగ మంత్రుల భేటీ

India – China Relations : చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు చాలా సేపు చ‌ర్చించారు. ఇరు దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల వివాదానికి త్వ‌ర‌లోనే పుల్ స్టాప్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు స‌రైన ప్ర‌దేశంలో మ‌రోసారి కూర్చుని మాట్లాడుకునేందుకు ఇరువురు అంగీక‌రించారు. ఇదే విష‌యాన్ని చైనా విదేశాంగ శాఖ మంత్రి వెల్ల‌డించారు.

స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతి నెల‌కొంటే త‌ప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండ‌వ‌ని ఇప్ప‌టికే భార‌త్ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం భార‌త్ జి20 గ్రూప్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. నిన్న‌, ఇవాళ ప్ర‌పంచంలోని విదేశాంగ శాఖ మంత్రుల‌తో శుక్ర‌వారం భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క్విన్ గ్యాంగ్ , జై శంక‌ర్ క‌లుసుకున్నారు. ప‌దే ప‌దే స‌రిహ‌ద్దు వివాదం గురించే ఎక్కువ సేపు చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

వీలైనంత త్వ‌ర‌గా త‌మ స‌రిహ‌ద్దులో ప‌రిస్థితిని సాదార‌ణ నిర్వ‌హ‌ణ కింద‌కు తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అందుకు భార‌త్, చైనా క‌లిసి చ‌ర్చించు కోవాల‌ని(India – China Relations) స్ప‌ష్టం చేశారు క్విన్ గ్యాంగ్. తూర్పు ల‌డ‌ఖ్ లో 34 నెల‌ల సుదీర్ఘ వివాదం మ‌ధ్య న్యూఢిల్లీలో ఇరు దేశాల‌కు చెందిన మంత్రులు క‌ల‌వ‌డం ఇదే తొలిసారి.

విచిత్రం ఏమిటంటే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు క్విన్ గ్యాంగ్ అత్యంత న‌మ్మ‌క‌స్తుడు..స్నేహితుడు కూడా. ప్ర‌స్తుతం భార‌త్ తో స‌త్ సంబంధాలు కొన‌సాగించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు క్విన్ గ్యాంగ్. ఒకానొక ద‌శ‌లో చైనా రాద‌ని అనుకున్నారు. కానీ ఎట్ట‌కేల‌కు క్విన్ గ్యాంగ్ రావ‌డం, భేటీ కావ‌డం జ‌రిగింది.

Also Read : ప్ర‌మాదంలో భార‌త ప్ర‌జాస్వామ్యం

Leave A Reply

Your Email Id will not be published!