R Krishnaiah : సీఎం కేసీఆర్ పై కృష్ణయ్య కన్నెర్ర
82 వేల ఉద్యోగాల ఊసేదంటూ ఫైర్
R Krishnaiah : వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సోయి తప్పి పాలన సాగిస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పే రోజు తప్పకుండా వస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా 82 వేల పోస్టులను భర్తీ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఏమైనవని ప్రశ్నించారు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah).
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని , బడుల్లో పంతుళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక జూనియర్, డిగ్రీ కాలేజీలలో సైతం ఖాళీలు ఉన్నాయని, ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్శిటీలలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ భర్తీ చేసిన పాపాన పోలేదని ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే సీఎంకు(CM KCR) బుద్ది చెప్పాలన్నారు.
ఓ వైపు తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ చెబుతున్న సీఎం జీతాలు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పదవీ విరమణ పొందిన వారితో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించడం రూల్స్ కు విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అయితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని కానీ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఎందుకు నియమించడం లేదంటూ నిప్పులు చెరిగారు ఆర్. కృష్ణయ్య.
Also Read : మునుగోడు ఉప ఎన్నికపై ఉత్కంఠ