R Ravi Kannan : రవి కన్నన్ రామన్ మెగసెసె విన్నర్
ఆసియా ఖండపు నోబెల్ బహుమతి
R Ravi Kannan : ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెస్ అవార్డుకు భారతీయ వైద్యుడు ఎంపికయ్యారు. ఎటువంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ రవి కన్నన్(R Ravi Kannan) కు ఈ పురస్కారం లభించింది.
R Ravi Kannan Got Award
రవి కన్నన్ తన భార్య సీతతో కలిసి 2007లో కాచర్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ కు బాధ్యత వహించేందుకు చెన్నై నుండి అస్సాం లోని సిల్చార్ కు వెళ్లాడు. ఆయన పద్మశ్రీ గ్రహీత కూడా. సీసీహెచ్ఆర్సీ డైరెక్టర్ గా ఉన్నాడు. 2023లో రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న నలుగురిలో ఒకరిగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆస్పత్రికి లభించిన గౌరవంగా అభివర్ణించాడు. తామంతా ఒక టీమ్ గా పని చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడానికి అందరూ సమానంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ పని చేస్తున్న వారే కాదు బయటి నుండి పని చేస్తున్న వారు కూడా ఈ అవార్డుకు అర్హులని స్పష్టం చేశాడు రవి కన్నన్.
Also Read : Satya Pal Malik : ఓటు వజ్రాయుధం జర భద్రం