Rishi Sunak : జాత్యహంకారం అత్యంత ప్రమాదం – సునక్
తాను కూడా ఎదుర్కొన్నానని పేర్కొన్న పీఎం
Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్(Rishi Sunak) సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజ కుటుంబంలో జాత్యహంకార ధోరణి చోటు చేసుకుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు పీఎం. ఇది ఎక్కడ జరిగినా దానిని ఎదిరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను కూడా ఒకానొక సమయంలో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని గుర్తు చేశారు రిషి సునక్. టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంకా ఇలాంటి అసంబద్దమైనవి చోటు చేసుకోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు పీఎం.
జాత్యహంకార ధోరణి మనుషుల మధ్య మరింత దూరాలను పెంచుతుందన్నారు రిషి సునక్. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే అందరికీ ఈ దేశంలో బతికే హక్కు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్చగా బతికేందుకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. తానైనా లేదా రాజ కుటుంబమైనా ఇతరుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ప్రపంచ దేశాలు పరస్పరం కలిసి ఉంటున్నాయని, ఈ పురోభివృద్ది చెందుతున్న కాలంలో జాత్యహంకార ప్రదర్శన , ధోరణి ప్రదర్శించడం ఎంత మాత్రం సమంజసనీయం కాదన్నారు రిషి సునక్(Rishi Sunak). దేశంలో ఎవరైనా ఇలాంటి వాటికి చోటు కల్పిస్తే తాము సహించబోమంటూ హెచ్చరించారు.
తన దృష్టిలో దేశం వాటన్నింటిని దాటుకుని ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. కాగా ఇటీవల బ్రిటన్ రాజ కుటుంబం గురించి కానీ, ఇటీవల చోటు చేసుకున్న ఘటన గురించి కానీ ఎక్కడా ప్రస్తావించక పోవడం విశేషం.
కాగా ప్రిన్స్ విలియం గాడ్ మదర్ లేడీ సుసాన్ హసీ జాత్యహంకార ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి.
Also Read : చైనాలో స్వర్ణ యుగం ముగిసింది – సునక్