Radhe Shyam Movie : రాధే శ్యామ్ మూవీ డేట్ ఫిక్స్

మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్

Radhe Shyam Movie  : రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాగా తెర కెక్కిన డార్లింగ్ ప్ర‌భాస్, ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే న‌టించిన రాధే శ్యామ్ మూవీ విడుద‌ల తేదీ ఖ‌రారైంది.

ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించారు. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

దీంతో ప్ర‌భాస్, పూజా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు.

క‌రోనా కార‌ణంగా ప్ర‌ధాన చిత్రాల‌న్నీ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇక రాధే శ్యామ్ (Radhe Shyam Movie)కూడా ఓటీటీ లో విడుద‌ల అవుతోందోంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీనికి పుల్ స్టాప్ పెడుతూ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఆరు నూరైనా స‌రే కేవ‌లం థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మూవీ మేక‌ర్స్.

ఇక రాధే శ్యామ్ ప్రీ ఈవెంట్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

అంతే కాదు ల‌వ్ డెస్టినీకి మ‌ధ్య జ‌రిగే వార్ ను మార్చి 11న చూసి త‌రించండి అంటూ ఓ క్యాచీ క్యాప్ష‌న్ జోడించింది చిత్ర యూనిట్.

భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన సినిమాల‌న్నీ ఇప్ప‌టికే విడుద‌ల డేట్స్ ప్ర‌క‌టించాయి.

తాజాగా రాధే శ్యామ్(Radhe Shyam Movie) చిత్రానికి సంబంధించి అప్ డేట్ రావ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటలీ లోనే షూటింగ్ ఎక్కువ‌గా జ‌రుపుకుంది. రూ. 300 కోట్ల రూపాయ‌లు ఈ సినిమాను నిర్మించారు.

బిగ్గెస్ట్ బ‌డ్జెట్ గా రూపుదిద్దుకుంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాధే శ్యామ్ చిత్రాన్ని వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీద నిర్మించారు.

ఈ ఒక్క చిత్రానికి మొద‌టిసారిగా ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు ప‌ని చేయ‌డం విశేషం. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్, అర్జిత్ సింగ్ , మిథున్, అనూ మాలిక్ , మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ , జ‌బిన్ నౌతీయ‌ల్ , మ‌నోజ్ ముంటాషిర్, కుమార్, ర‌ష్మీ విరాగ్ అందించారు.

Also Read : కేజీఎఫ్ -2 మూవీ టీం ప్ర‌త్యేక పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!