Radhe Shyam Movie : ఓవ‌ర్సీస్ లో రాధే శ్యామ్ సెన్సేష‌న్

మెల్ బోర్న్ లో మూవీకి ఆద‌ర‌ణ‌

Radhe Shyam Movie : పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్ , బుట్ట బొమ్మ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన రాధే శ్యామ్ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ స‌న్నాహాలు ఏర్పాటు చేశారు.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారి పోయాడు ప్ర‌భాస్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించాడు రాధే శ్యామ్(Radhe Shyam Movie). కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణ మూవీస్ , యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై ప్ర‌మోద్, వంశీ, ప్ర‌శీద‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వ‌చ్చే మార్చి 2 నుంచి రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టనున్న‌ట్లు చిత్ర వ‌ర్గాల టాక్. ఇదిలా ఉండ‌గా మూవీకి సంబంధించి ఇప్ప‌టి దాకా విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, సాంగ్స్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది.

క‌రోనా కార‌ణంగా విడుద‌ల‌ను వాయిదా వేశారు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియో ఆవ‌ర‌ణ‌లో భారీగా రాధే శ్యామ్ ట్రైల‌ర్ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది అభిమానులు త‌ర‌లించారు.

కొన్నేళ్ల పాటు ప్ర‌భాస్ కోసం రాసుకున్న క‌థ ఇది అని ఆ మ‌ధ్య చెప్పాడు రాధాకృష్ణ కుమార్. ట్రైల‌ర్ పై భారీ అంచ‌నాలు చోటు చేసుకున్నాయి. ఇంకా విడుద‌ల కాక ముందే మూవీకి సంబంధించిన టికెట్లు అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ ఐమాక్స్ లో ఏకంగా 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడు పోయిన‌ట్లు స‌మాచారం. ఇంకా విడుద‌ల‌కు కొన్ని రోజులు ఉండ‌గానే ఇప్ప‌టికే టికెట్ల కోసం డిమాండ్ ఉండ‌డం ప్ర‌భాస్ కు ఉన్న రేంజ్ ఏపాటిదో చెబుతుంది.

దేశంలోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకునే న‌టుడిగా పేరొందాడు. బాహుబ‌లి త‌ర్వాత అత‌డి స్టార్ ఇమేజ్ మ‌రింత పెరిగింది.

Also Read : ఫిల్మ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా పుష్ప‌

Leave A Reply

Your Email Id will not be published!