Raghav Chadha : వైసీపీ..బీజేడీపై రాఘవ్ చద్దా ఫైర్
కేంద్రానికి ఎలా మద్దతిస్తారని ప్రశ్న
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం, ఒడిస్సాలో కొలువు తీరిన బీజేడీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు.
దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్నాయని, కనీసం ముందు వెనుకా ఆలోచించకుండా ఎలా ఇలా నిర్ణయం తీసుకుంటారని సీఎం జగన్ మోహన్ రెడ్డి, బిజూ పట్నాయక్ లను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తంచేశారు రాఘవ్ చద్దా(Raghav Chadha).
Raghav Chadha Comments
అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్దమైన రాష్ట్ర అధికారాలను దోచుకునే వారికి మద్దతు ఇవ్వడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు మరోసారి ఆలోచించాలని అన్నారు. ఇవాళ కేంద్రానికి సపోర్ట్ ఇచ్చామని ఆనంద పడుతున్నారని, రేపొద్దున రాబోయే ఎన్నికల్లో విపక్షాల కూటమి ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఇలాగే వ్యవహరిస్తారా అని సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు ఆప్ ఎంపీ.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజల తో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాక్షస పాలనకు చెరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Minister KTR : సీఎం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం – కేటీఆర్