Raghav Chadha : మోదీ స్పందించక పోతే ఎలా
కేంద్రం తీరు దారుణమన్న ఎంపీ
Raghav Chadha : మణిపూర్ మండుతోందని గత కొంత కాలంగా మేమంతా గొంతు చించుకుని అరుస్తున్నాం. మా పార్టీకి చెందిన ఎంపీని మాట్లాడకుండా చేశారు. చివరకు రాజ్యసభలో లేకుండా చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha). పార్లమెంట్ భవన ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
Raghav Chadha Asking
ప్రధాన మంత్రికి మన్ కీ బాత్ లో మాట్లాడేందుకు సమయం ఉంటుందని, కానీ మండుతున్న, హింసాత్మక ఘటనలతో రగిలి పోతున్న మణిపూర్ పై మాట్లాడేందుకు మనసు ఒప్పడం లేదని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రధాని ఇలాగేనా వ్యవహరించేది అంటూ నిప్పులు చెరిగారు.
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ ప్రధానులు ఇలా ప్రవర్తించ లేదన్నారు రాఘవ్ చద్దా. మణిపూర్ కు సంబంధించి చర్చించాలని తొలిసారిగా రాజ్యసభలో 65 మంది ఎంపీలు నోటీసు ఇచ్చారని వెల్లడించారు. గతంలో కేవలం ఒక్క ఎంపీ నోటీసు ఇచ్చినా చర్చకు ఆమోదం లభించేది. కానీ ఇంత మంది ఎంపీలు నోటీసు ఇస్తే ఎందుకు స్పించడం లేదని చైర్మన్ ను నిలదీశారు ఎంపీ. గతంలో ఆనాటి నెహ్రూ నుంచి మన్మోహన్ దాకా నోటీసు కింద వివరంగా చర్చించారని తెలిపారు.
Also Read : Tamannah Heros : ఆల్ స్టార్స్ పై తమన్నా కామెంట్స్